thumb

విందు వినోదం

వాసవి జాగృతి ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన ఆశయాలలో భాగమైన స్నేహాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా విందు వినోదం అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సభ్యులు ఒక సంవత్సర కాలంలో ఒకసారి సభ్యులందరితో కూడి ఒకే చోట కుటుంబ సభ్యులతో కలిసి విందును ఆరగించి అనంతరం ఒక వినోద కార్యక్రమానికి సంబంధించిన సినిమా కానీ, సభ్యుల మధ్య వినోదానికి సంబంధించిన కాంపిటెషన్స్ గాని నిర్వహించి వారి మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మరింతగా పెంపొందించేలా చేయాలని పిలుపునివ్వaడం జరిగింది.

ఇప్పటికే కొన్ని క్లబ్బులు వారు ఈ విందు వినోదం అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన క్లబ్బుల వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ... మిగిలిన క్లబ్బులు వారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.