పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని పెద్దలు మహానుభావులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు పల్లెకి పోదాం ఛలో ఛలో అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ రోజుల్లో అందరూ పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నారు అటువంటి వారికి పల్లెల యొక్క విలువ వారి యొక్క జీవన విధానం ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయం, పశుపోషణ, సంబంధ బాంధవ్యాల గురించి తెలియని పరిస్థితిలో ఉన్నారు. వారందరికీ వీటిపై అవగాహన కలిగించాలని ఉద్దేశంతో పల్లెకు పోదాం ఛలో ఛలో అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి జాగృతి సభ్యులు వారి వారి పుట్టిన ఊరు పల్లెటూరు అయితే ఆ పల్లెకు కుటుంబంతో కలిసి సంవత్సరంలో ఒకరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పల్లెను సందర్శించి అక్కడ ఉన్నటువంటి బంధువులను గాని, స్నేహితులని గాని కలుసుకొని పిల్లలకు వీటిపై అవగాహన కల్పించి మధురమైన జ్ఞాపకాలు ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను.