వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాల కార్యక్రమాలు, వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు గడిచినటువంటి రెండు సంవత్సరాల కాలంలో అత్యంత అద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అందరి మన్ననలు పొందామని భావిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా మన సంస్థ ఆశయాల్లో ముఖ్యమైనది స్నేహం.
స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే సదుద్దేశంతో అనేక కార్యక్రమాలు సంస్థలో రూపకల్పన చేయడం జరిగింది. ఈ స్నేహాన్ని పెంపొందించుకునే కార్యక్రమంలో భాగంగా ఆహ్లాదకరమైన విదేశీ యాత్ర కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజులు పాటు మలేషియా యాత్రను 56 మంది సభ్యులతో చక్కటి ప్లానింగ్ తో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విదేశీ యాత్రను దిగ్విజయం చేయడం జరిగినది.
మరల స్నేహాన్ని పెంపొందించే ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులు పాటు థాయిలాండ్ విదేశీ యాత్రను చక్కటి ప్లానింగ్ తో డిజైన్ చేయడం జరిగింది. ఈ విదేశీ యాత్రలో తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ పాల్గొనేలా చేస్తూ వారి వైవాహిక జీవితంలో ఈ విదేశీ యాత్ర ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. చాలామందికి విదేశాలకు వెళ్లాలి అక్కడ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ భాషా సమస్య వల్ల కానీ అక్కడ ఎలా వసతులు ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన లేక డబ్బు ఉన్నా సరే వెళ్లలేనటువంటి పరిస్థితిలో చాలామంది సభ్యులు ఉంటారు. ఇలా గ్రూపుగా అందరం కలిసి వెళ్లడం వలన ఈ సమస్యను అధిగమించి అందరూ చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఒక విదేశీ యాత్రకు వెళ్లి వచ్చాము అన్న సంతృప్తితో ఉండడానికి అవకాశం ఉన్న విదేశీ యాత్రకు ప్రతి సభ్యులు కుటుంబంతో కలిసి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.