thumb

గుప్పెడు బియ్యం

వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం గుప్పెడు బియ్యం పథకం. ఈ పథకం ద్వారా సమాజంలో ఉన్న పేదవారికి ఆహారాన్ని అందించాలని సదుద్దేశంతో మన ముందుకు తీసుకువచ్చిన ఒక మంచి పధకం. క్లబ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో భాగంగా అన్నం వండుకోవడానికి బియ్యాన్ని పక్కన పెట్టుకుంటారు. అలా పక్కన పెట్టిన బియ్యం లోంచి మీకు తోచినంత ఒక గుప్పెడు (పిడికెడు) బియ్యాన్ని ఒక క్లాత్ బ్యాగ్ లో పోసి పక్కన పెట్టుకుని, ఇలా ప్రతిరోజు ఆ బ్యాగులో పోసిన బియ్యాన్ని ప్రెసిడెంట్ గారు సూచించిన నెలలో ఒక రోజు ఆ బియ్యాన్ని ఒక వృద్ధాశ్రమానికి గాని, అనాధాశ్రమానికి గాని, ఒక స్కూలుకు కానీ, హాస్టల్ కి గాని, ఒక గుడికి గాని అందరి మెంబర్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసి ఒకేసారి అందించడం జరుగుతుంది.

ఇలా నెల రోజులు కలెక్ట్ చేసిన బియ్యాన్ని అలా ఇవ్వడం ద్వారా ఆ వృద్ధాశ్రమం, అనాధాశ్రమాల్లో జరిగే అన్నదాన కార్యక్రమంలో క్లబ్బులో ఉన్నటువంటి సభ్యులందరూ పాల్గొన్నట్టుగా జరుగుతుంది. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మిన్న అన్న పెద్దవారి సూచనలను పాటిస్తూ మనకు ఆత్మ సంతృప్తి కలిగే ఈ మహత్తర కార్యక్రమానికి క్లబ్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు క్లబ్ అధ్యక్షునికి సహకరించి ఈ గుప్పెడు బియ్యం కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.