thumb

జాగృతి జవాన్

ఒకరి కోసం అందరం ఒక సంస్థ గాని ఒక సంఘం గాని స్థాపించిన యొక్క ముఖ్య ఉద్దేశం ఆ సంస్థలో ఉన్న సభ్యులందరూ ఐక్యమత్యంగా ఉండటం కోసం.... ఎవరికి ఏదైనా కష్టం గానీ ఇబ్బందిగాని కలిగితే మరొకరు సహాయం సహకరించుకోవడం. కానీ నేటి కాలంలో అవి కేవలం మాటలు గానే ఉండిపోతున్నాయి, ఆ మాటలు నిజం చేయాలని ఉద్దేశంతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు సభ్యులకు ప్రతి సమావేశంలో సంస్థ యొక్క ఆశయాలలో ఒకటిన స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో వారందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ఒకరి కోసం అందరం అనే ఒక కార్యక్రమం ద్వారా సభ్యులందరినీ కలిసి ఒకే తాటిపై నిలపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సభ్యుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మిగిలిన సభ్యులు వెళ్లిన వెళ్లకపోయినా సంస్థలో ఉన్న క్లబ్ లో ఉన్న సభ్యులకు ఏదైనా కష్టం కలిగిన ఇబ్బంది కలిగిన ఆ కుటుంబం లోని వ్యక్తిని వారు పోగొట్టుకున్న ఆ సమయంలో మాత్రం తప్పనిసరిగా మిగిలిన సభ్యులు వెళ్లి పరామర్శించి ఈ కష్టంలో ఈ బాధలో మేము అందరం నీకు తోడుగా ఉంటాం అని ఒక మాట భరోసాని ఇవ్వండి అని అవగాహన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే శుభకార్యాలప్పుడు ఎంతమంది వచ్చినా గుర్తు ఉన్నా గుర్తు లేకపోయినా కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు ఒంటరి వాడివి కాదు అని ఒక మానసికమైనటువంటి భరోసాని, మాటని ఆ సమయంలో గనుక ఇచ్చిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోయే అవకాశం లేదు కాబట్టి అటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని మరల తీసుకొచ్చినది వాసవి జాగృతి ఇంటర్నేషనల్. ఈ విషయంలో పిలుపునిచ్చిన వెంటనే ఇప్పటికే కొన్ని క్లబ్బులు ఆచరణలోకి తీసుకోవడం జరిగింది ఒక కాకి చనిపోతే వంద కాకులు తోడవుతాయి అని మన ఎన్నో సందర్భాల్లో చెబుతుంటాం మరి ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మన సభ్యులందరూ తోడుగా ఉండాలి ఆ కష్టాన్ని పంచుకోవాలి అన్న విషయాన్ని అవగాహన చేసుకుని క్లబ్లో ఉన్న సభ్యులందరూ అందరికీ ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.