ఆర్యవైశ్యులు అంటే వ్యాపారస్తులు... వ్యాపారస్తులు అంటే ఆర్యవైశ్యులు. అటువంటి మంచి గుర్తింపు ఉన్న ఆర్యవైశ్య వ్యాపారస్తుల మనుగడ నేటి కాలంలో చాలా కష్టతరంగా ఇబ్బందికరంగా మారింది ఆర్థికంగా చాలామంది ఆర్యవైశ్య చిరు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ ఇబ్బంది కరోనా కాలం తర్వాత ఇబ్బంది మరింతగా పెరిగింది అద్దెలు కట్టలేక పెట్టుబడులు పెట్టలేక గుమస్తాల్ని చేర్చుకోలేక తీసుకొచ్చిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఆర్యవైశ్య చిరు వ్యాపారస్తుల జీవితాల్లోకి వెలుగులు తీసుకురావాలని సదుద్దేశంతో వ్యాపారికి సహకారి అని పేరుతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు సహకారి అని వడ్డీ లేని రుణాన్ని క్లబ్బుల ద్వారా ఆర్యవైశ్య చిరు వ్యాపారస్తులకు పదివేల రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే పద్దతి పై ఈరోజు వరకు 123 మంది ఆర్యవైశ్య చిరు వ్యాపారస్తులకు అందించడం జరిగింది. ఈ పథకం ద్వారా లబ్దిదారుల మోముల్లో చిరునవ్వును చూస్తూ వారికి ఆర్థికంగా సహాయపడుతున్న సహకారి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పదివేల రూపాయలు మొత్తాన్ని ఒక దాత దాతృత్వం ద్వారా సంస్థ స్వీకరించి, సేకరించన మొత్తాన్ని ఆ వచ్చిన మొత్తాన్ని ఒక లబ్దిదారులకు దాత పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి పదివేల రూపాయలు సహకారి దాత చెల్లిస్తే ప్రతి 10 నెలలకు వారి పేరు మీద ఒక లబ్దిదారులకు అందజేయడం జరుగుతుంది. కావున క్లబ్బు నాయకులు ఈ విషయాన్ని గ్రహించి మీ క్లబ్బులో ఉన్న లేదా మీ గ్రామాలలో ఉన్న ఆర్యవైశ్య చిరు వ్యాపారస్తులను గుర్తించి వారికి ఈ సహకారి మొత్తాన్ని అందించి వారి వ్యాపార అభివృద్ధి కొరకు సహకరించండి.