thumb

సామూహిక కళ్యాణమస్తు

వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు నమ్మకం బాధ్యత భరోసా అనే విధానాలతో ముందుకు సాగుతుంది. సమాజంలో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి నమ్మకమైన సేవలు అందిస్తూ బాధ్యతగా ఉంటూ మేమున్నాము అనే భరోసాని కల్పిస్తూ మంచి స్వచ్ఛంద సేవా సంస్థగా కొద్దికాలంలోనే గుర్తింపు పొందింది.

ఈ సంస్థ ద్వారా దాతల సహకారంతో పేద ఆర్యవైశ్య యువతకి వివాహా నిమిత్తం సహకారాన్ని సహాయాన్ని అందించాలనే సదుద్దేశంతో మన ముందుకు తీసుకొచ్చిన అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన పథకమే కళ్యాణమస్తు.

ఈ కళ్యాణమస్తు అనే పథకం ద్వారా పేద ఆర్యవైశ్య అమ్మాయికి వివాహం చేయాలనే తల్లిదండ్రులకు స్థానిక క్లబ్ ప్రెసిడెంట్, గవర్నర్, ఐసీసీ ఆఫీసర్ల రికమండేషన్తో అప్లికేషన్ పంపిస్తే ప్రతి సంవత్సరం దాతల సహకారంతో సామూహిక వివాహాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎంత మంది దాతలు అయితే ముందుకువచ్చారో అన్ని అప్లికేషన్లు విడుదల చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేవారు ఎవరైతే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి శ్రావణమాసంలో అన్ని వసతులు సమకూరుస్తూ ఒకే వేదికపై సామూహికంగా వివాహాలు చేయడం జరుగుతుంది.

ఏ దాతయితే 25 వేల రూపాయలు అందజేస్తారో ఆ మొత్తంలో ఆ పెళ్లికూతురుకు మంగళసూత్రం, కాలికి మెట్టెలు, తలంబ్రాలు చీర, వివాహ సామాగ్రి, పంతులుగారు, 50 మందికి భోజనాలు, వేదిక అన్ని ఏర్పాటు చేసి మేళతాళాల మధ్యన సామూహికంగా వివాహ కార్యక్రమాలు నిర్వహించడం ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునేవారు తప్పకుండా మీ స్థానిక క్లబ్బు నాయకులను గాని, జిల్లా నాయకులు గాని, ఇంటర్నేషనల్ నాయకులు గానీ సంప్రదించగలరు.