ఆర్యవైశ్య యువతీ యువకుల వివాహాల నిమిత్తం మీడియేటర్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు వాసవి జాగృతి కళ్యాణమస్తు అనే వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేయడం జరిగింది. ఆర్యవైశ్య యువతీ యువకుల తల్లిదండ్రులను ఆ గ్రూపులో జాయిన్ చేసి వారు ప్రతి శనివారం, ఆదివారం గ్రూపులో వారి పిల్లల యొక్క బయోడేటాలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ వారి పిల్లల యొక్క వివాహాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఉద్దేశంతో ఈ గ్రూపు ద్వారా ముందుకు సాగుతుంది.
ఈ గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ చాలా చక్కటి క్రమశిక్షణతో వారి పిల్లల యొక్క బయోడేటాలు, ఫోటోలు పెడుతూ గ్రూప్ చైర్మన్ ల ఆదేశాలను పాటిస్తూ గ్రూప్ యొక్క క్రమశిక్షణ దెబ్బతినకుండా చాలా మంచి విధి విధానాలతో ఆ గ్రూపు దిగ్విజయంగా సాగుతుందని గర్వంగా తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు ఈ గ్రూపులో ఉన్నటువంటి సభ్యుల ద్వారా యువతీ యువకులకు వివాహాలు కుదిరాయని సంతోషంగా తెలియజేస్తున్నాము. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు వాసవి జాగృతి కళ్యాణమస్తు అనే వాట్సాప్ గ్రూప్ ను ఇలా క్రమశిక్షణగా నిర్వహిస్తున్నందుకు పలువురు అభినందనలు తెలియజేశారు.