thumb

కళ్యాణమస్తు 2ⁿᵈ లైఫ్

ఆర్యవైశ్య యువతీ యువకుల్లో ఏదైనా కారణాలతో విడాకులు తీసుకున్నటువంటి జంటలకు భర్త గాని భార్య గాని స్వర్గస్తులయితే వారికి పునర్వివాహం చేసుకోవాలని ఆలోచన ఉంటే అటువంటి వారందరికీ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు వాసవి జాగృతి కళ్యాణమస్తు 2nd లైఫ్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూపులో 500 మంది సభ్యులు జాయిన్ కావడం జరిగింది.

ఆ గ్రూపు ద్వారా పునర్వివాహం చేసుకోవాలనే వారు ప్రతి శనివారం ఆదివారం వారి యొక్క బయోడేటాలు ఫోటోలు గ్రూపులో పోస్ట్ చేసుకొని మిగిలిన వారి యొక్క బయోడేటాలు మిగిలిన ఐదు రోజులు చూస్తూ వారికి నచ్చిన సంబంధాలను వారు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ గ్రూపు ద్వారా అనేక మందికి పునర్వివాహం జరిగి వారి వైవాహిక జీవితాన్ని కొత్తగా ప్రారంభించడం జరిగింది.

ఈ గ్రూపును చాలా చక్కటి క్రమశిక్షణతో నిర్వహిస్తున్నాము సభ్యులు కూడా చక్కగా సహకరిస్తున్నారు ఎటువంటి కమిషన్ లేకుండా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు ఆర్యవైశ్య యువతీ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి వివాహాలను నిమిత్తం సపోర్ట్ చేస్తున్న వాసవి జాగృతి ఇంటర్నేషనల్ నాయకులకు హృదయపూర్వక అభినందనలు సంతోషంగా తెలియజేస్తున్నాము.